ఇరిగేషన్‌ ప్రాజెక్టులు గాలికొదిలేశారు

ABN , First Publish Date - 2023-03-05T00:03:06+05:30 IST

రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను అధికార వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రాపురం ఎన్‌ఎ్‌సపీ రెగ్యులేటర్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, రానున్న బడ్జెట్‌లో కనీసం 10శాతం నిధులను ఇరిగేషన్‌కు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టులు గాలికొదిలేశారు
విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

విస్సన్నపేట, మార్చి 4 : రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను అధికార వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రాపురం ఎన్‌ఎ్‌సపీ రెగ్యులేటర్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, రానున్న బడ్జెట్‌లో కనీసం 10శాతం నిధులను ఇరిగేషన్‌కు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, గత ప్రభుత్వ హయాంలో రూ.3,800 కోట్లు కేటాయించి 70 శాతం పనులు పూర్తి చేశారని మరో వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సందర్శించి త్వరలో విజయవాడలో ఇరిగేషన్‌ అధికారులు, రైతులు, రాజకీయ పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. అవసరమైతే కేంద్ర జలవనరులశాఖ మంత్రిని కలిసి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరతామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్‌, రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని వెంకట రామారావు, సీహెచ్‌ కోటేశ్వరరావు, ఎం.త్యాగరాజు, కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:03:06+05:30 IST