ముగిసిన అంతర్‌ కళాశాలల క్రీడలు

ABN , First Publish Date - 2023-03-31T00:55:56+05:30 IST

జేఎన్‌టీయూకే అంతర్‌ కళాశాలల సెంట్రల్‌ జోన్‌ టోర్నమెంట్‌ 2023 విజయవంతంగా ముగిశాయని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టోర్నమెంట్‌ సెక్రటరీ మత్తి శివశంకర్‌ తెలిపారు. 198 జట్లు పోటీల్లో తలబడ్డాయని, 55 మంది ఫిజిక్‌ డైరెక్టర్‌లు రిఫరీలుగా వ్యవహరించి బుధవారం అర్ధరాత్రి వరకూ ఎంతో ఉత్కంఠబరితంగా ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు.

ముగిసిన అంతర్‌ కళాశాలల క్రీడలు
ట్రోఫీలతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు

గుడ్లవల్లేరు, మార్చి 30 : జేఎన్‌టీయూకే అంతర్‌ కళాశాలల సెంట్రల్‌ జోన్‌ టోర్నమెంట్‌ 2023 విజయవంతంగా ముగిశాయని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టోర్నమెంట్‌ సెక్రటరీ మత్తి శివశంకర్‌ తెలిపారు. 198 జట్లు పోటీల్లో తలబడ్డాయని, 55 మంది ఫిజిక్‌ డైరెక్టర్‌లు రిఫరీలుగా వ్యవహరించి బుధవారం అర్ధరాత్రి వరకూ ఎంతో ఉత్కంఠబరితంగా ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

పురుషుల విభాగంలో..

వాలీబాల్‌ విన్నర్స్‌గా రాజమండ్రి గోదావరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులు, రన్నర్స్‌గా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ నిలిచాయి. కబడ్డీలో విన్నర్స్‌గా పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా శేషాద్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల నిలిచాయి. టేబుల్‌ టెన్నీ్‌సలో విన్నర్స్‌గా కాకినాడ వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, రన్నర్స్‌గా తాడేపల్లి గూడెం వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ నిలిచాయి. బాల్‌ బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌ గుడ్లవల్లేరు శేషాద్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా విజయవాడ ఎస్‌.ఆర్‌.కె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల నిలిచాయని టోర్నమెంట్‌ సెక్రటరీ మత్తి శివశంకర్‌ తెలిపారు.

మహిళా విభాగంలో..

వాలీబాల్‌ విన్నర్స్‌గా గుడ్లవల్లేరు శేషాద్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా గుంటూరు సెంట్‌ మెరిస్‌ కళాశాల నిలిచాయి. కబడ్డీ విన్నర్స్‌గా గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా కాకినాడ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ కళాశాల నిలిచాయి. టేబుల్‌ టెన్నీస్‌ విన్నర్స్‌గా విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా గుడ్లవల్లేరు శేషాద్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల నిలిచాయి. బాల్‌ బ్యాడ్మింటన్‌ విన్నర్స్‌గా గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్‌ కళాశాల, రన్నర్స్‌గా విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ నిలిచినట్టు టోర్నమెంట్‌ సెక్రటరీ మత్తి శివశంకర్‌ తెలిపారు. విజేతలకు ట్రోఫీలను టోర్నమెంట్‌ చైర్మన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.ఎ్‌స.ఎన్‌.ఆర్‌.వి ప్రసాద్‌, కన్వీనర్‌ పి.కోదండ రామారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.ఆర్‌.సిహెచ్‌ శాస్త్రి తదితరులు అందజేశారు.

Updated Date - 2023-03-31T00:55:56+05:30 IST