మహనీయుల స్ఫూర్తితో సంపూర్ణ న్యాయవాదులుగా ఎదగండి

ABN , First Publish Date - 2023-09-18T01:18:28+05:30 IST

సహనంలో మహాత్మాగాంధీ, జ్ఞానంలో అంబేడ్కర్‌, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకుని న్యాయ వాదులు పనిచేస్తే సంపూర్ణ న్యాయవాదులుగా ఎదుగుతారని జిల్లా ప్రోటో కాల్‌ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి అన్నారు. జి

మహనీయుల స్ఫూర్తితో సంపూర్ణ న్యాయవాదులుగా ఎదగండి
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మొదటి అంతస్తును ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు

హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి హితవు

బందరు జిల్లా కోర్టులో ఫాస్ట్ట్‌ట్రాక్‌ కోర్టు మొదటి అంతస్తు భవనం ప్రారంభం

మచిలీపట్నం, సెప్టెంబరు 17( ఆంధ్రజ్యోతి): సహనంలో మహాత్మాగాంధీ, జ్ఞానంలో అంబేడ్కర్‌, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకుని న్యాయ వాదులు పనిచేస్తే సంపూర్ణ న్యాయవాదులుగా ఎదుగుతారని జిల్లా ప్రోటో కాల్‌ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మొదటి అంత స్తు భవనాన్ని జస్టిస్‌ వీఆర్‌కే కృషాసాగర్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికలతో కలసి ఆదివారం ఆయన ప్రారంబించారు. అనంతరం మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ హాలులో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర న్యాయవ్యవస్థకు ఎంతోమంది న్యాయ మూర్తులను, న్యాయవాదులను అందించిన ఘనత మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌కు దక్కిందన్నారు. తనసొంత బార్‌ అసోషియేషన్‌కు మళ్లీ రావడం ఆనందంగా ఉందని, మచిలీపట్నంలో నూతనకోర్టులు, భవనాలు ఏర్పాటు చేయడానికి మచిలీపట్నం బార్‌ అసోషియేషన్‌ చేసిన కృషి అభి నందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు. మొదటి అద నపు జిల్లాజడ్జి చిన్నంశెట్టి రాజు, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్‌ షేక్‌మహ్మద్‌ ఫజులుల్లా, పదవ అదనపు జిల్లా జడ్జి ఎ.నరసింహమూర్తి, ఆరవ అదనపు జిల్లాజడ్జి ఎస్‌.చిట్టిబాబు, మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.హరిబాబు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T01:18:28+05:30 IST