ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2023-01-25T00:34:44+05:30 IST

మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలను మంగళవారం మైలవరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో రాజ్యలక్ష్మిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
విస్సన్నపేటలో అధికారుల తనిఖీ

విస్సన్నపేట, జనవరి 24: మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలను మంగళవారం మైలవరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో రాజ్యలక్ష్మిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, పురుగు మందుల లైసెన్స్‌, స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. లైసెన్స్‌లు లేని రూ.7.45 లక్షల విలువగల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. డీలర్లు లైసెన్స్‌ ఉన్న ఎరువులు మాత్రమే విక్రయించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-01-25T00:34:44+05:30 IST