ఆకట్టుకున్న స్టెల్లా అగ్రిఎక్స్‌పో
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:10 AM
నేషనల్ ఫార్మర్స్ డేను పురస్కరించుకుని శుక్రవారం మారిస్ స్టెల్లా కళాశాలలో అగ్రిఎక్స్‌పో నిర్వహించారు.
ఆకట్టుకున్న స్టెల్లా అగ్రిఎక్స్‌పో
పటమట, డిసెంబరు 22 : నేషనల్ ఫార్మర్స్ డేను పురస్కరించుకుని శుక్రవారం మారిస్ స్టెల్లా కళాశాలలో అగ్రిఎక్స్‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రేఖ ప్రారంభించారు. విద్యార్థులు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతను తెలుసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో మల్చింగ్ పద్ధతిలో మొక్కల పెంపకం, డ్రోన్ సహాయంతో వ్యవసాయం చేయటం, సోలార్ టెక్నాలజీని ఉపయోగించడం, ఆటోమేటిక్ వాటరింగ్ టెక్నాలజీ మెథడ్, రోబోటిక్ స్పేర్స్ తదితర నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగపడే వివిధ ఆధునిక సామాగ్రి, పండించిన పంటలు, రైతులు పండించిన చిరుధాన్యాలు, నూతన వంగడాలు, సేంద్రీయ పద్ధతులలో సాగువిధానం వంటి ఎన్నో మోడల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. విజయవాడ పరిసర ప్రాంత రైతులు, కళాశాలల విద్యార్ధులు స్కూలు విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అగ్రికల్చర్ విభాగం అధ్యక్షుడు లక్ష్యణస్వామి, డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉషాకుమారి, మనోజ్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.