ఆకట్టుకున్న నాటికలు

ABN , First Publish Date - 2023-06-03T00:54:09+05:30 IST

హర్ష క్రియేషన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.

ఆకట్టుకున్న నాటికలు

విజయవాడ కల్చరల్‌, జూన్‌ 2 : హర్ష క్రియేషన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు. పిఠాపురానికి చెందిన కొండవరం గ్రామ శ్రీ మణికంఠ ఆర్ట్స్‌ సంస్థ బృందం ప్రదర్శించి న ‘కొత్తతరం కొడుకు’ నాటిక చక్కని సందేశాన్ని అందించింది. శ్రీ రామకృష్ణారావు మూల కథను ఆధారంగా తీసుకొని చలికాని వెంకట్రావు నా టకీకరణ దర్శకత్వంలో ఈ నాటిక రూపుదిద్దుకొంది. చిలకలూరిపేటకు చెందిన మద్దుకూరి ఆర్ట్‌ క్రియేషన్స్‌ బృందం ప్రదర్శించిన ‘మృత్యుపత్రం’ నాటిక మద్దుకూరి రవీంద్రబాబు రచనా దర్శకత్వంలో సాగింది. అనకాపల్లికి చెందిన మాతృశ్రీ కళానికేతన్‌ బృందం ప్రదర్శించిన ‘పనికిరాని వాడు’ కార్పొరేట్‌ బట్టి చదువులపై వ్యంగాస్ర్తాన్ని సంధించింది. ముత్యాలరావు రచనా దర్శకత్వంలో నాటిక రూపుదిద్దుకొంది. ఈ మూడు నాటికలకు శీలం రంగారావు, కె.వెంకటరమణ, కొప్పుల ఆనంద్‌ అశోక్‌లు పారితోషికాలు అందించారు. సుఖమంచి కోటేశ్వరరావు, ఆంజనేయరావు, నందివాడ నాని, విన్నకోట గంగా శివకుమార్‌, కవి, మరుపిళ్ల హనుమంతరావు, చెరుకూరి సాంబశివరావు, వెంకట నరసింహారావు, నిర్వాహకులు కత్తి శ్యాంప్రసాద్‌, అనంత హృదయ రాజ్‌, ఎజ్జల విజయసాగర్‌, ఈవేళ రమే్‌షబాబు, మల్లేశ్వర పట్నాయక్‌, గుడివాడ లహరి, శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:54:09+05:30 IST