కక్షసాధింపుతోనే బాబుపై అక్రమకేసులు
ABN , First Publish Date - 2023-09-20T01:19:55+05:30 IST
విజనరీ లీడర్ చంద్రబాబు కృషి వల్లే అగ్రరాజ్యమైన అమెరికాలో తెలుగువారు మంచిహోదాలో ఆత్మగౌరవంతో లబ్ధిపొందుతున్నారని ఎన్నారై టీడీపీ ఆస్టిన్ అ ధ్యక్షుడు లెనిన్ యర్రం అన్నారు.

హనుమాన్‌జంక్షన్ రూరల్, సెప్టెంబరు 19: విజనరీ లీడర్ చంద్రబాబు కృషి వల్లే అగ్రరాజ్యమైన అమెరికాలో తెలుగువారు మంచిహోదాలో ఆత్మగౌరవంతో లబ్ధిపొందుతున్నారని ఎన్నారై టీడీపీ ఆస్టిన్ అ ధ్యక్షుడు లెనిన్ యర్రం అన్నారు. అమెరికాలోని టె క్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ప్రవాసాంధ్రులు, టీడీపీ కా ర్యకర్తలతో పాటు మహిళలు కుటుంబసభ్యులతో కలి సి చంద్రబాబు అరె్‌స్టకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యా న్ని కాపాడండి.. చంద్రబాబు జిందాబాద్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. స్కిల్ డవలప్మెంట్ పథకానికి నిధులు అందజేసిన అధికారులను వదిలి అప్పటి సీ ఎం చంద్రబాబుపై కేసు పెట్టి రిమాండ్‌కు పంపడం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని రాష్ట్ర సా గునీటి సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ అన్నా రు. రాష్ట్రాభివృద్ధికి కృషిచేసే చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.సుమంత్ పుసులూరి, రవి కొత్త, ఉద య్ మేకా, హరి బాచిన, శ్రీధర్ పోలవరపు, శివ తా ళ్లూరి, చిరంజీవి మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుడికి బొండా వినతి పత్రం
సత్యనారాయణపురం: పాయకాపురం ఉడాకాలనీలో టీడీపీ నేతలు బత్తుల కొండ, పైడి శ్రీనుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి పందిరిలో మాజీ సీ ఎం చంద్రబాబుపై జరుగుతున్న కుట్రలు కుయుక్త లు పటాపంచలవ్వాలని, ఆయనకు శుభం జరగాలని కోరుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉ మామహేశ్వరరావు విఘ్నేశ్వరుడికి వినతి పత్రం అం దజేశారు. చవితి పందిరి వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఆయన పందిరిలో చంద్రబాబు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా త్వరలో చంద్రబాబు కడిగిన ముత్యాంలా బయటకు వస్తారని, రా ష్ట్రంలో రామరాజ్యం తీసుకు వస్తారన్నారు. బత్తుల కొండ, గంటా కృష్ణమోహన్, పైడి తులసి, లబ్బదుర్గ, పైడి శ్రీను, లాబ్బా వైకుంఠం, ఎరుబోతు రమణారావు, జెజ్జం జయపాల్, కాశిం పాల్గొన్నారు.
దాసాంజనేయస్వామికి కొల్లు ప్రత్యేక పూజలు
గుణదల: అసత్య ఆరోపణలతో సైకో జగన్మోహనరెడ్డి కారణంగా జైలుపాలైన చంద్రబాబు వెంటనే జైలు నుంచి బయటికి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించేలా ఆశీర్వదించాలని కోరుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాసాంజనేయస్వామిని వేడుకున్నారు. సోమవారం ఉదయం మాచవరంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు చేశారు. బాబుతో మేము అనే నినాదంతో కార్యక్రమాలు చేసు ్తన్న 26వ డివిజన్ వాసులకు కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నిరంకుశత్వ పాలనకు పాల్పడుతున్న జగన్మోహనరెడ్డిని ఇంటికి సాగనంపేందుకు రోజులు దగ్గరడ్డాయన్నారు. ఓటు హక్కుతో ప్రజలు జగన్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు సంపిద్ధులయ్యారన్నారు. రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగువారు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారంటే ఆయనలో నిబద్దతే కారణమన్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో డివిజన్ ఇన్‌చార్జ్ వల్లభనేని సతీష్, 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ అధ్యక్షుడు తోట పాండు, టీడీపీ నేతలు కడియం ప్రకాష్, నవులూరి సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ఆరాద్యుల విజు, గోగం సురేష్, రాజు, చిరంజీవి పాల్గొన్నారు.
మోకాళ్లపై దుర్గమ్మ కొండపైకి..
వన్‌టౌన్: చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి జగన్‌రెడ్డి పైశాచికానందం పొందుతున్నాడని తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణి విమర్శించారు. చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా విడుదలవ్వాలని కోరుతూ, దుర్గ్గగుడి మెట్లమార్గంలో మోకాళ్లపై నడచుకుంటూ వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు గోత్రనామాలతో ఆయన క్షేమం కోరుతూ, త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ అర్చన చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేని చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపాలన్న కుట్రతో ఆధారాలు లేని కేసు పెట్టారన్నారు. పైశాచికానందం పొందుతున్న జగన్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మమేనన్నారు.ఆమె వెంట బొప్పన నీరజ, పెందుర్తి శ్రీకాంత్, తుమ్మల సత్య, బొమ్మసాని అరుణకుమారి, భార్గవి, లత, సుజాత పాల్గొన్నారు.
టీడీపీ నేతలకు గద్దె పరామర్శ
పటమట: అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ వన్‌టౌన్ వినాయకుడి గుడి నుంచి కనకదుర్గమ్మ ఆ లయంలో కొబ్బరికాయల మొక్కును తీర్చేందుకు వె ళుతున్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతలకు సంఘీభావంగా పోలీ్‌సస్టేషన్‌కి వెళ్లి పరామర్శించారు.