పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తాం

ABN , First Publish Date - 2023-01-06T00:25:02+05:30 IST

నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకుంటే గుత్తేదార్లకు బిల్లులు చెల్లింపులు నిలిపివేస్తామని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తాం
వివరాలు పరిశీలిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తాం

వీఎంసీ కమిషనర్‌ హెచ్చరిక

గవర్నర్‌పేట, జనవరి 5: నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకుంటే గుత్తేదార్లకు బిల్లులు చెల్లింపులు నిలిపివేస్తామని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు. 23వ డివిజన్‌ సీవీఆర్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల కింద రూ. 1.50 కోట్లతో నిర్మిస్తున్న నూతన స్కూల్‌ భవనాల పనులను గురువారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాణాలు నిర్ధేశించిన మేరకు లేకుంటే గుత్తేదార్లకు బిల్లులు చెల్లింపులు నిలిపివేస్తామని అన్నారు. కమిషనర్‌ పర్యటనలో డిప్యూటీ ఈఈ గురునాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-06T00:25:08+05:30 IST