AP High Court: అధికారులకు విధించిన శిక్షను సవరించిన ఏపీ హైకోర్టు
ABN , First Publish Date - 2023-01-18T14:16:28+05:30 IST
అమరావతి (Amaravathi): కోర్టు ధిక్కారం కేసులో ఇద్దరు అధికారులకు విధించిన శిక్షను ఏపీ హైకోర్టు (AP High Court) సవరించింది.

అమరావతి (Amaravathi): కోర్టు ధిక్కారం కేసులో ఇద్దరు అధికారులకు విధించిన శిక్షను ఏపీ హైకోర్టు (AP High Court) సవరించింది. ఇద్దరు అధికారులు రాజశేఖర్ (Rajasekhar), రామకృష్ణ (Ramakrishna) కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో అధికారుల వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా శిక్షను సవరించింది. ఈరోజు హై కోర్టు ముగిసే వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని జడ్జి ఆదేశిస్తూ.. ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించారు.
అంతకుముందు న్యాయస్థానం ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. సర్వీస్ అంశాలలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో శిక్ష విధించింది. గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇద్దరు అధికారులకూ నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా విధించింది. రాజశేఖర్, రామకృష్ణను తుళ్లూరు పోలీసులకు అప్పగించాలని ఎస్పీఎఫ్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత వారు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జడ్జి ఈ మేరకు శిక్షను సవరించారు.