సెగభగలు

ABN , First Publish Date - 2023-05-26T00:49:59+05:30 IST

రోహిణీ కార్తె ప్రభావం గురువారం స్పష్టంగా కనిపించింది. భానుడు సెగలు కక్కాడు. వచ్చేనెల 3వ తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సెగభగలు

దాదాపు అన్నిచోట్లా 40 డిగ్రీలు నమోదు

బయటకు రావాలంటేనే భయంభయం

సాయంత్రానికి చల్లబడిన వాతావరణం

జూన్‌ 4 నుంచి రుతుపవనాల రాక

విజయవాడ, మే 25 (ఆంధ్రజ్యోతి) : రోహిణీ కార్తె ప్రభావం గురువారం స్పష్టంగా కనిపించింది. భానుడు సెగలు కక్కాడు. వచ్చేనెల 3వ తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌ నుంచి మొదలైన వేడుగాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా రోహిణీ కార్తె ప్రారంభం కాగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. ఉదయం నుంచి సాయంత్రం వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై కనిపించింది. కృష్ణాజిల్లాలోని నందివాడలో 44.5, ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, జూన్‌ 4 నుంచి రుతుపవనాలు ఉమ్మడి జిల్లాను తాకుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం నాటి ఉష్ణోగ్రతలు ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎ.కొండూరులో 41.2, చందర్లపాడులో 40.4, జి.కొండూరులో 40.5, గంపలగూడెంలో 40.7, ఇబ్రహీంపట్నంలో 41.4, కంచికచర్లలో 41.9, మైలవరంలో 40.2, నందిగామలో 42.2, పెనుగంచిప్రోలులో 41.0, రెడ్డిగూడెంలో 40.7, తిరువూరులో 41.4, వత్సవాయిలో 40.6, వీరులపాడులో 41.5, విజయవాడ రూరల్‌లో 41.3, విజయవాడ అర్బన్‌లో 41.3, విస్సన్నపేటలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డలో 39.7, బంటుమిల్లిలో 40.3, బాపులపాడులో 41.8, చల్లపల్లిలో 40.5, గన్నవరంలో 41.9, ఘంటసాలలో 42.1, గుడివాడలో 40.8, గుడ్లవల్లేరులో 43.1, గూడూరులో 41.3, కంకిపాడులో 40.3, కోడూరులో 42.1, కృత్తివెన్నులో 36.1, మచిలీపట్నంలో 40.2, మోపిదేవిలో 40.8, మొవ్వలో 41.9, నాగాయలంకలో 40.6, పామర్రులో 41.2, పమిడిముక్కలలో 41.5, పెడనలో 41.7, పెదపారుపూడిలో 42.7, పెనమలూరులో 40.4, తోట్లవల్లూరులో 42.0, ఉంగుటూరులో 41.9, ఉయ్యూరులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

Updated Date - 2023-05-26T00:49:59+05:30 IST