దీవెనల సిరి గుణదల పుణ్యక్షేత్రం

ABN , First Publish Date - 2023-02-07T01:19:23+05:30 IST

గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు అన్నారు.

దీవెనల సిరి గుణదల పుణ్యక్షేత్రం

గుణదల, ఫిబ్రవరి 6 : గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు అన్నారు. గుణదలమాత మహోత్సవాలో భాగంగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలు సోమవారం 7వ రోజుకు చేరుకున్నాయి. భక్తులు కొవ్వొత్తులు చేబూని మరియతల్లి గీతాలు ఆాపిస్తూ కొండ మధ్యలోగల మరియమాత గుహ వద్దకు చేరుకున్నారు. నెల్లూరు కతోలిక పీఠం బిషప్‌ పిడతల జోసఫ్‌ హాజరై మాట్లాడుతూ మరియమాత దేవుని తల్లి అయినప్పటికీ యేసుప్రభువు పట్ల ఎప్పుడూ వినయ విధేయతలతో మెలిగిందన్నారు. మోన్సిగ్ఞోర్‌ మువ్వల ప్రసాద్‌ మాట్లాడుతూ ఉత్సవాలకు ఇంకా 3రోజుల వ్యవధిమాత్రమే ఉండటంతో ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం దివ్యపూజాబలి సమర్పించి భక్తులకు గురువులు దివ్యసత్ప్రసాదం అందజేశారు. ఎస్‌ఎ్‌ససీ డైరెక్టర్‌ తోట సునీల్‌రాజు, ఎన్‌.డేవిడ్‌ రాజు, పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:19:24+05:30 IST