గుడ్లవల్లేరు లయన్స్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2023-07-11T01:52:49+05:30 IST
: గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ సేవలు అమోఘమని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ అన్నారు
గుడ్లవల్లేరు, జూలై 10 : గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ సేవలు అమోఘమని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు 2023-24 కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. అధ్యక్షుడిగా బొర్రా నాగేశ్వరరావు, కార్యదర్శిగా చలసాని శ్రీధర్, కోశాధికారిగా మేరుగు పెరుమాళ్లు, ఉపాధ్యక్షులుగా మత్తి శ్రీరామమూర్తి, దేవిశెట్టి రామకృష్ణ, జంగం మోహనరావు, మెంబర్‌షిప్ ఎక్సెటెన్షన్ చైర్మన్‌గా పొట్లూరి రవికుమార్, 23 మంది డైరెక్టర్లు, వివిధ కమిటీల నిర్వాహకులుగా మరికొందరు బాధ్యతలు చేపట్టారు. వల్లభనేని రామకృష్ణ (అమెరికా)తన తండ్రి వల్లభనేని వీరభద్రరావు జ్ఞాపకార్థం ఎనిమిది మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున రూ.40వేలను స్కాలర్‌షి్‌పగా అందజేశారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా నలుమూల నుంచి వచ్చిన లయన్స్ సత్కరించారు. కొసరాజు బాపయ్య చౌదరి, వై.పి.సి ప్రసాద్, మిరియాల వెంకటేశ్వరరావు, శేషగిరి, వి.ఆంజనేయులు, వేమూరి సత్యనారాయణ, రామకృష్ణ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ కామినేని అచ్యుతబాబు, పోలవరపు వెంకటరావు, వల్లభనేని వెంకట సుబ్బారావు చౌదరి పాల్గొన్నారు.