Vijayawada: కాకినాడ దుర్ఘటన పట్ల గవర్నర్ దిగ్బ్రాంతి...

ABN , First Publish Date - 2023-02-09T16:21:10+05:30 IST

విజయవాడ: కాకినాడ (Kakinada) దుర్ఘటన పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Vijayawada: కాకినాడ దుర్ఘటన పట్ల గవర్నర్ దిగ్బ్రాంతి...

విజయవాడ: కాకినాడ (Kakinada) దుర్ఘటన పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం, జీ రంగంపేటలోని అంబటి ఆయిల్స్ పరిశ్రమ (Ambati Oils Industry)లోని ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తూ.. ఏడుగురు కార్మికులు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమన్నారు. పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణ, మొచ్చంగి నరసింగా, మొచ్చంగి సాగర్, కురతాడు బంజుబాబు , కుర్రా రామారావు, పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదీష్ , ప్రసాద్ మృతులుగా గుర్తించారు. జిల్లా యంత్రాంగం నుంచి గవర్నర్ వివరాలు అడిగి తెప్పించుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియచేస్తూ.. రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు.

గురువారం ఉదయం అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకులో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు.

ఇది కూడా చదవండి..

వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. దీంతో ట్యాంకర్‌ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు. వారంతా ఊపిరాడక చనిపోయినట్లు తోటి కార్మికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-02-09T16:21:15+05:30 IST