గాయపరుస్తున్న గ్రామ సింహాలు
ABN , First Publish Date - 2023-03-13T00:52:00+05:30 IST
కడవకొల్లు , వీరవల్లి, పొట్లపాడులో వీధికుక్కల స్వైర విహారంతో స్థానికులు బెంబేలెత్తుతున్నా రు. గ్రామంలో రామాలయం రోడ్డుతో పా టు ఇతర రోడ్లపై కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఉయ్యూరు, మార్చి 12 : కడవకొల్లు , వీరవల్లి, పొట్లపాడులో వీధికుక్కల స్వైర విహారంతో స్థానికులు బెంబేలెత్తుతున్నా రు. గ్రామంలో రామాలయం రోడ్డుతో పా టు ఇతర రోడ్లపై కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలు గ్రామాలు, ప్రాం తాల్లో మనుషులపై కుక్కలు దాడిచేసి గాయపరుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ కుక్క ఎక్కడ కరుస్తుందో అన్న భయంతో పిల్లలు, వృద్ధులు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. గ్రామంలో గుంపులుగా తిరుగుతూ పిల్లలపైకి దాడికి పాల్పడు తున్నాయి. ఇప్పటికే రామాలయం వీధిలోని ఒక వృద్ధుడిని, వినాయకగుడి పరిధిలోని ఒక యువకుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ నేపథ్యంలో రోడ్లపైన పిల్లలను ఆడుకునేందుకు కూడా తిరగ కుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీకుం టున్న పరిస్థితులు ఏర్పడ్డాయని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకుని కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. కుక్కల బెడద సమస్య మాదృష్టికి రాలేదని, వస్తే సమస్య పరిష్కరించేందుకు కార్యదర్శికి ఆదేశాలిస్తా మని ఈవోపీఆర్డీ మైథీలి తెలిపారు.