గ్యాస్ ధర పెంపుపై ఆందోళన
ABN , First Publish Date - 2023-03-02T00:48:40+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి పెద్దు వాసుదేవరావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గన్నవరంలో నాయకులు బుధవారం ధర్నా చేశారు.
గన్నవరం, మార్చి 1 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి పెద్దు వాసుదేవరావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గన్నవరంలో నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ, గ్యాస్ ధరలు పెరగటం వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతాయ న్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ధరలు పెరుగుతాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగే ధరలకు హద్దే లేకుండా పోయింద న్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారా దత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలను మరింత పేదవారిగా మార్చే కుట్ర బీజేపీ చేస్తుంద న్నారు. కేంద్రానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నాయకులు ముక్కామల ఉమామహేశ్వరరావు, పెద్దు వెంకటరత్నం, కాట్రగడ్డ రామచంద్ర జోషి, కట్టవరపు విజయరావు తదితరులు పాల్గొన్నారు.
ఉయ్యూరు : నిత్యావసర సరుకుల ధరలు అకాశానం టుతున్న తరుణంలో వంటగ్యాస్ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా సహాయ కార్యదర్శి బి కీర్తి ఆరోపించారు. వంటగ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం రోడ్డులో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్యాస్ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చిందన్నారు. డీజిల్, పెట్రోల్, అన్ని నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్న పరిస్థితుల్లో సామాన్యులు విలవిల లాడుతుంటే పెరిగిన గ్యాస్ ధరతో మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ జిల్లా నాయకురాలు నిమ్మాది ప్రశాంతి, హైమా, సంతోష్‌కుమారి, నాగలక్ష్మి, రమాదేవి, కుసుమ తదితరులు పాల్గొన్నారు.