పర్యాటక ప్రాంతంగా గాంధీహిల్‌: కమిషనర్‌

ABN , First Publish Date - 2023-06-11T00:42:20+05:30 IST

పర్యాటక ప్రదేశంగా గాంధీహిల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు.

పర్యాటక ప్రాంతంగా గాంధీహిల్‌: కమిషనర్‌

పర్యాటక ప్రాంతంగా గాంఽధీహిల్‌: కమిషనర్‌

వన్‌టౌన్‌, జూన్‌ 10: పర్యాటక ప్రదేశంగా గాంధీహిల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు. రూ.80 లక్షల వ్యయంతో గాంధీహిల్‌పై పునరుద్ధరించిన పనులను ఆయన శనివారం పరిశీలించారు. ప్లానిటోరియం, దానిలోపల సీటింగ్‌, ఖగోళ వస్తువులు తదితరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ హిల్‌ను పర్యాటక ప్రాంతంగా తీసుకుని రావడం కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు ఏర్పాట్లు చేసిందన్నారు. గాంధీహిల్‌ చారిత్రాత్మక ప్రదేశమన్నారు. ఇక్కడ జాయ్‌ ట్రైన్‌, గ్రంథాలయం, లైటింగ్‌, సౌండ్‌ సిస్టంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఆటపరికరాలు, కొన్నింటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన శాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు అధికారులు వి. సత్యవతి, జుబిన్‌ శిరన్‌ రాయ్‌,. ఈఈ ఏఎస్‌ ఎన్‌ ప్రసాద్‌, ఏడీహెచ్‌ శ్రీనివాసు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:42:20+05:30 IST