సామాజిక, ఆర్థిక విప్లవకారుడు గాంధీ
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:35 AM
‘గాంధీ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. సామాజిక ఆర్థిక విప్లవకారుడు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రం గంలో ఆయన చేసిన కృషి, ప్రయోగాలు నేటి ప్రపంచీకరణ యుగంలో ఎంతో ఉపకరిస్తాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్య అసమానతలు, అపార్థాలూ, విద్వేషాలూ పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో ఆధునికతరానికి గాంధీని సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని మాజీ ఉపసభా పతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
ఆధునిక తరానికి మహాత్ముడు చాలా అవసరం
పుస్తకప్రదర్శనలో గాంధీ స్మారకనిధి స్టాళ్ల ప్రారంభోత్సవంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
విజయవాడ కల్చరల్, డిసెంబరు 30: ‘‘గాంధీ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. సామాజిక ఆర్థిక విప్లవకారుడు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రం గంలో ఆయన చేసిన కృషి, ప్రయోగాలు నేటి ప్రపంచీకరణ యుగంలో ఎంతో ఉపకరిస్తాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్య అసమానతలు, అపార్థాలూ, విద్వేషాలూ పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో ఆధునికతరానికి గాంధీని సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని మాజీ ఉపసభా పతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవంలో మూడో రోజు శనివారం ప్రాంగణంలో రాష్ట్ర గాంధీ స్మారకనిధి నిర్వహిస్తున్న స్టాళ్లను ఆయన ప్రారంభించారు. గాంధీ స్మారకనిధి స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిధి కార్యదర్శి వై.రామచంద్రరావు తెలిపారు. గాంధీ స్మారకనిధి స్టాళ్లలో బాలలు చరఖా వడకడం నేర్పుతామని, గాంధీకి సంబంధించిన పుస్తకాలు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించామని సంయుక్త కార్యదర్శి రావి శారద తెలిపారు. స్టాలులో గాంధీకి సంబంధించిన వస్తువులు, చిత్రాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ కేజీ శంకర్, నిధి సభ్యురాలు జి.రశ్మి, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహరనాయుడు, ఎమెస్కో విజయకుమార్, బెల్లపు బాబ్జీ, కృపాక రరావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు.