తూర్పులో మళ్లీ గద్దెకే విజయం

ABN , First Publish Date - 2023-06-03T00:53:09+05:30 IST

2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్‌ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

తూర్పులో మళ్లీ గద్దెకే విజయం

విద్యాధరపురం, మే 2 : 2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్‌ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో ప్రవేశపెట్టి న మినీ మేనిఫెస్టోపై శుక్రవారం గురునానక్‌ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణమండపంలో తూ ర్పు నియోజకవర్గం టీడీపీ శ్రేణులకు అవగాహన సదస్సు నిరహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్‌రెడ్డికి ఓట మి భయం పట్టుకుందన్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌, తాడేపల్లి, ఇడుపులపాయతో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్యాలె్‌సలున్న జ గన్‌ ఎలా పేదవాడవుతాడని ప్రశ్నించారు. చం ద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లను పంపిణీ చే యలేని జగన్‌ పేదల పక్షపాతి ఎలా అవుతాడన్నారు. హైదరాబాద్‌ ఇప్పుడు ఈ విధంగా ఉం దంటే నాడు చంద్రబాబు అభివృద్ధికి పునాది వేయబట్టేనన్నారు. మేనిఫెస్టో గురించి తొలిసారిగా ఇక్కడే అవగాహన సదస్సు జరుగుతోం దని, ఇక అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీలకు జగన్‌ చేసిన ద్రోహం గురించి వివరించారు. మహాశక్తి పథకం ప్రవేశపెట్టి ఆడపడచులకు చంద్రబాబు అన్న అయ్యారన్నారు. గద్దె రామ్మోహన్‌ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో ఆయనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జాతీయ పాలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ వైసీపీ ఎమ్యెల్యేలు సైతం మెచ్చుకునే ఏకైక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. తూర్పులో ఆయ న్ను ఓడించడం కష్టమని, మరోసారి గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మె జారిటీ సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశా రు. అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన తూర్పు వైసీపీ నేత గద్దెపై గెలవాలని అనుకుంటున్నాడని, అతని నక్కజిత్తుల ప్రయత్నాలు పనిచేయవన్నారు. జగన్‌ దంపతులకు వివేకానందరెడ్డి హత్యకేసు ఫోబియా పట్టుకుందని, అలాగే చంద్రబాబు ప్రకటించిన మేనిఫె స్టో వణుకు పుట్టిస్తోందన్నారు. సీబీఐ తమను ఎప్పుడు పిలస్తుందోనన్న భయంతో జగన్‌ దం పతులు ఉన్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మో హన్‌ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలోని అం శాలను గురించి వివరించారు. జడ్పీ మాజీ చై ర్‌ పర్సన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకం మహిళల మనస్సులకు హత్తుకుందన్నారు. చెన్నుపాటి గాంధీ, ఫిరోజ్‌, జాస్తి సాంబశివరావు, పొట్లూరి సాయిబాబు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో మ హిళలు హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు.

Updated Date - 2023-06-03T00:53:09+05:30 IST