వైసీపీ నుంచి టీడీపీలోకి..
ABN , First Publish Date - 2023-11-10T01:33:40+05:30 IST
టీడీపీతోనే బలహీన వర్గాల అభ్యు న్నతి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్, నవంబరు 9: టీడీపీతోనే బలహీన వర్గాల అభ్యు న్నతి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ కానుమోలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పులివర్తి రాజీవ్ క్రిస్టఫర్ (బాజీ)తో పాటు 25మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి యార్లగడ్డ సాదరంగా ఆహ్వానించారు. కలసికట్టుగా పనిచేసి టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, చెడుగొండి శివశంకర్, దన్నే దుర్గారావు, కాటుమాల పృధ్వీ, తొమ్మం డ్రు రాహుల్, మజ్జిగ నాగరాజు పాల్గొన్నారు.