ధాన్యం డబ్బులివ్వండి!

ABN , First Publish Date - 2023-02-21T01:12:09+05:30 IST

దళారులకు, మ ధ్యవర్తులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఊదరగొ ట్టి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు ధ్వజమెత్తారు.

ధాన్యం డబ్బులివ్వండి!

పెనమలూరు, ఫిబ్రవరి 20 : దళారులకు, మ ధ్యవర్తులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఊదరగొ ట్టి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు ధ్వజమెత్తారు. సోమవారం కానూరులోని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు పండగ వాతావరణం కల్పిస్తామని, ధాన్యం అమ్మిన మూడువారాల్లో రైతుల ఖాతా ల్లో సొమ్ము జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 50 రోజులు గడిచినా పైసా విదిల్చలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే రైతులను మోసం చేస్తుంటే రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా 1న ఎమ్మెల్యేలు, మంత్రులు తమ జీతాలు, అలవెన్సులు తీసుకోవడం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాల ను కొనసాగిస్తున్న ప్రభుత్వం దుక్కి దున్ని తమ రక్తా న్ని చెమటగా మార్చి పండించిన పంటకు సొమ్ములు చెల్లించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఖా తాల్లో డబ్బులు జమ చేయకుండా ఏ పండుగలు చేసుకోవాలో ప్రభుత్వం తెలపాలని కోరారు. అప్పులు చేసి ఎండనకా, వాననకా డాది పొడవునా కష్టపడి పంట పండిస్తే మాయమాటలు చెప్పి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. పండిన ప్రతి గింజా కొంటామని చెబుతూనే టార్గెట్‌ అయిపోయిందని కృష్ణాజిల్లాలో 40 రైస్‌మిల్లులను ధాన్యం కొనుగోలు చేయకుండా నిలిపేశారని గు ర్తు చేశారు. ఇంకా 40శాతం పంట రైతుల వద్దే మూ లుగుతోందని వాపోయారు. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రవాణా, కాటా కూలీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం నూర్పిడి జరిగి వారాలు దాటుతున్నా కొనే నాథుడు లేక, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకొనే అవకాశం లేక అప్పుల వాళ్లు, ఎరువుల దుకాణాల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఏం చెప్పాలో తెలియక రైతు లు దిక్కులు చూస్తున్నారని మండిపడ్డారు. అనంత రం కార్యాలయం జనరల్‌ మేనేజరు శిరీషకు రైతు సంఘం తరపున పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివనాగేంద్రం, పంచకర్ల రంగారావు, రామాంజనేయ ప్రసాద్‌, గౌరిశెట్టి నాగేశ్వరరా వు, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ ఆంజనేయులు, జిల్లా కోశాధికారి టీవీ లక్ష్మణస్వామి, సహా య కార్యదర్శులు ఎం.సురే్‌షబాబు, నారాయణరావు, మరియదాసు, వీ శ్రీనివాసరావు, సొంఠి ఉమామహేశ్వరరావు, శివశంకరరావు, మద్దాల సాయిబాబు, కొండ రామిరెడ్డి, మాదు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను

పరిష్కరిస్తాం : జనరల్‌ మేనేజర్‌ శిరీష

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని జనరల్‌ మేనేజర్‌ శిరీష తెలిపారు. రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-02-21T01:12:10+05:30 IST