ఎన్‌సీసీ కేడెట్లకు ఫైర్ ఫైటింగ్‌పై శిక్షణ
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:59 AM
యాన్యువల్ ట్రైనిం గ్‌లో భాగంగా శనివారం ఎన్‌సీసీ కేడెట్లకు ఫైర్ ఫైటింగ్, వివిధ రకాలైన మంటలను ఏవిధంగా ఆర్పవచ్చు వంటి అంశాలు తెలియజేశారు.
ఎన్‌సీసీ కేడెట్లకు
ఫైర్ ఫైటింగ్‌పై శిక్షణ
పటమట, డిసెంబరు 30: యాన్యువల్ ట్రైనిం గ్‌లో భాగంగా శనివారం ఎన్‌సీసీ కేడెట్లకు ఫైర్ ఫైటింగ్, వివిధ రకాలైన మంటలను ఏవిధంగా ఆర్పవచ్చు వంటి అంశాలు తెలియజేశారు. డిస్ర్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ వినయ్ మాట్లాడుతూ వంటగది నుంచి వచ్చే మంటలను నీటితో ఆర్పాలని, లైవ్ ఎలక్ర్టికల్ పరికరాలలో మంటలకు క్లాస్ సి అగ్నిమాపక పరిక రాలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. మోనో అమ్మోనియం ఫాస్పేట్, సోడియం బై కార్బోనేట్‌లను వాడి ఈ రకమైన మంటలను ఎదుర్కోవడం జరుగుతుందని వివరించారు. అసిస్టెంట్ ఫైర్‌ఆఫీసర్ సునీల్ కుమార్, ఆపరేటర్ శివనాగరాజు, ఫైర్‌మెన్లు రాంబాబు, గోపినాథ్, క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.