Share News

సీఎం జన్మదిన వేడుకలకు

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:22 AM

సీఎం జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ డుమ్మా కొట్టారు. నియోజకవర్గంలో గురువారం జరిగిన సీఎం జన్మదిన వేడుకలకు వసంత మొహం చాటేడయం తీవ్ర చర్చనీయాంశమైంది. నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ కొందరు సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొనక పోవడంతో ఉన్న కొందరు వైసీపీ నేతలు వేడుకలను మమ అనిపించారు.

సీఎం జన్మదిన వేడుకలకు

మైలవరం, డిసెంబరు 21 : సీఎం జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ డుమ్మా కొట్టారు. నియోజకవర్గంలో గురువారం జరిగిన సీఎం జన్మదిన వేడుకలకు వసంత మొహం చాటేడయం తీవ్ర చర్చనీయాంశమైంది. నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ కొందరు సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొనక పోవడంతో ఉన్న కొందరు వైసీపీ నేతలు వేడుకలను మమ అనిపించారు. నియోజకవర్గంలో జోగి పెత్తనం ఎక్కువ కావడంతో పాటు ఆయన వర్గీయులు ఈసారి మైలవరం నుంచి జోగి పోటీ చేస్తారని, వసంత పార్టీ మారతారని విపరీతంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. ఈసారి మైలవరం బరిలో నుంచి వసంత తప్పుకుంటున్నట్లు సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు గత మూడు నాలుగు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈప్రచారాన్ని ఆయన ఏమాత్రం ఖండించక పోవడం, వివరణ కూడా ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో పాటు సీఎం జన్మదిన వేడుకలు దూరం కావడంతో ఇనాళ్లు ఆయన వెంట ఉన్న వారు, జోగిని వ్యతిరేకించిన వారు డైలమాలో పడ్డారు. సీఎంవో పిలుపును కూడా లెక్క చేయకుండా, బుజ్జగింపులకు సైతం దొరక్కండా ఆయన ఎందుకున్నట్టు అనే అంతర్మథనంలో ఆయన వెంట ఉన్న వారు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈపరిణామాలన్నీ జోగి వర్గం క్యాష్‌ చేసుకుటుంది. 2024లో జోగి మైలవరం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన వర్గం ఘంటాపథంగా చెప్పుకుంటుంది. దాన్ని ఖండించేందుకు వసంత వర్గం దైర్యం కూడా చేయడం లేదు. సీఎం జన్మదినం సందర్భంగా వసంత ముఖం చాటేయడాన్ని కూడా జోగి వర్గం తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలతో మైలవరం వైసీపీలో అటు జోగి, ఇటు వసంత వర్గాల్లో విపరీతమైన టెన్షన్‌ మొదలయ్యింది. అయితే ఇదంతా ప్రతిపక్ష టీడీపీని ఇరుకున పెట్టే ఎత్తుగడేనని వసంత వర్గం చెప్పుకొస్తుంది. ఈటెన్షన్‌కు తెర పడాలంటే వసంత నోరు తెరవాలి.

Updated Date - Dec 22 , 2023 | 01:22 AM