కాల్వల్లో చెత్త వేస్తే జరిమానా విధించండి : కమిషనర్‌

ABN , First Publish Date - 2023-07-21T00:32:45+05:30 IST

నగరంలో ఎక్కడైనా కాల్వల్లో చెత్తవేస్తే వారికి భారీ జరిమానా విధించాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

కాల్వల్లో చెత్త వేస్తే జరిమానా విధించండి : కమిషనర్‌

కాల్వల్లో చెత్త వేస్తే జరిమానా విధించండి : కమిషనర్‌

గవర్నర్‌పేట, జూలై 20: నగరంలో ఎక్కడైనా కాల్వల్లో చెత్తవేస్తే వారికి భారీ జరిమానా విధించాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. నగరం నుంచి ప్రవహించే రైవస్‌ కాల్వను తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి నిడమానూరు వరకు ఆయన గురువారం పరిశీలించారు. కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా శానిటేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన శానిటేషన్‌ వర్కర్లు పనిలోకి వచ్చి కాల్వలు, వీదులు శుభ్రం చేస్తున్నదీ లేనిదీ శానిటేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్‌ పర్యటనలో కార్పొరేషన్‌ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:32:45+05:30 IST