అమెరికాలో తెలుగుతేజం
ABN , First Publish Date - 2023-07-21T01:54:52+05:30 IST
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో జరిగిన ఫెన్సింగ్ - 2023 పోటీల్లో తలశిల ఆరుష్ మొదటి స్థానంలో నిలిచి అమెరికా నేషనల్ చాంపియన్ సాధించాడు.
పాయకాపురం : అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో జరిగిన ఫెన్సింగ్ - 2023 పోటీల్లో తలశిల ఆరుష్ మొదటి స్థానంలో నిలిచి అమెరికా నేషనల్ చాంపియన్ సాధించాడు. కృష్ణాజిల్లాకు చెందిన నాగాయలంకకు తలశిల తిరుమలరావు కుమారుడు అరుష్. డాక్టర్ టి.ఎం.వి ప్రసాదరావుకు మనవడు. ఆరుష్ తల్లిదండ్రులు అమెరికాలోని సీఆర్‌టెల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందుకున్న ఆరుష్ తెలుగు వాడు కావడం మనక గర్వకారణం. ఇటువంటి విజయాలు మరెన్నో సాధిస్తూ ఒలింపిక్స్‌లో కూడా పతకాన్ని సాధించాలని పలువురు ఆకాంక్షించారు.