జగనన్న కాలనీల్లో సౌకర్యాలు కల్పించండి
ABN , First Publish Date - 2023-05-27T01:26:45+05:30 IST
జిల్లాలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేం దుకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించా లని కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. కరగ్రహారంలోని జగ నన్న కాలనీని శుక్రవారం పరిశీలిం చారు. ఇక్కడి 5వ డివిజన్‌లోని ఏ డీ బ్లాక్‌ల్లో నిర్మిస్తున్న ఇళ్లను, అధికా రులు రూపొందించిన ప్లాన్‌ను పరిశీ లిం చారు. ఈ సందర్భంగా లబ్ధిదారు లతో కలెక్టర్ కొంతసేపు మాట్లాడారు.

కరగ్రహారంలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు
ఆంఽధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేం దుకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించా లని కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. కరగ్రహారంలోని జగ నన్న కాలనీని శుక్రవారం పరిశీలిం చారు. ఇక్కడి 5వ డివిజన్‌లోని ఏ డీ బ్లాక్‌ల్లో నిర్మిస్తున్న ఇళ్లను, అధికా రులు రూపొందించిన ప్లాన్‌ను పరిశీ లిం చారు. ఈ సందర్భంగా లబ్ధిదారు లతో కలెక్టర్ కొంతసేపు మాట్లాడారు. ఆదిలక్మి అనే మహిళ మాట్లాడుతూ రహదారులు సక్రమంగా లేకపోవ డంతో ఇంటి నిర్మాణం వరకు ఇసుక, కంకర, సిమెంటు తదితర సామగ్రిని తీసుకురావడం కష్టంగా ఉందన్నారు. బి.సక్కుభాయి అనే మహిళ మాట్లాడుతూ విద్యుత్ సౌకర్యం లేకపో వడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలి పారు. పోతురాజు వెంకటేశ్వరమ్మ మాట్లాడు తూ భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా పునాదులను కొంతమేర ఎత్తుగా నిర్మాణం చేసుకున్నామని, మట్టి అవసరం ఉందని, మట్టి రవాణాకు అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఈ కాలనీలో అంతర్గత రహదారులను బలోపేతం చేయాలని, నిర్మాణం లో ఉన్న గృహాల వరకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మట్టిని ఉచితంగానే ఇస్తామని ట్రాక్టరు కిరాయిని లబ్ధిదారులు పెట్టుకుంటే సరిపోతుం దని కలెక్టర్ అన్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండి గృహ నిర్మాణంలో లబ్ధిదారలుగా ఉన్న మహిళలకు రూ. 35వేలను రుణంగా ఇప్పిం చినా, ఎందుకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించ లేదని సచివాలయ కార్యదర్శులను కలెక్టర్ అడిగారు. లబ్ధిదారుల వద్దకు పలుమార్లు వెళ్లి చెబుతూనే ఉన్నా మని, అయినా ముందుకు రావడంలే దన్నారు. మెప్మా అధికారులు, సిబ్బంది లబ్ధిదారులతో మాట్లాడి గృహల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కరగ్రహారం లేఅవుట్‌లో ఆశించిన మేర గృహల నిర్మాణం చేయడంలేదని, అధికా రులు ప్రతిరోజ ప్రత్యేకశ్రద్ధ చూపి వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. గృహనిర్మాణసంస్థ పీడీ జీవీ సూర్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ శివనారయణరెడ్డి, ఆర్డీవో ఐ.కిషోర్, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య, విద్యుత్‌శాఖ ఈఈ భాస్కరరావు, ఆర్‌డబ్య్లూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.