నియోజకవర్గంలో సహజవనరుల దోపిడీ
ABN , First Publish Date - 2023-11-21T01:21:05+05:30 IST
మైలవరం నియోజకవ ర్గంలో అపారంగా లభిస్తున్న సహజవనరులైన గ్రావెల్, ఇసుక బూడిద దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని, అది అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు దారి తీస్తోందని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు ఆరోపించారు.

అందినకాడికి దోచుకుంటున్న అధికార పక్ష నేతలు: మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు
ఇబ్రహీంపట్నం, నవంబరు 20: మైలవరం నియోజకవ ర్గంలో అపారంగా లభిస్తున్న సహజవనరులైన గ్రావెల్, ఇసుక బూడిద దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని, అది అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు దారి తీస్తోందని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. సంపాదనే ధ్యేయంగా అధికార పక్ష నేతలు సహజవనరులను అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధి తన అనుచరులతో నివాసయోగ్యం కాని భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి వాటి మెరక పేరుతో గ్రావెల్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎన్టీటీ పీఎస్ బూడిద విచ్చలవిడి తోలకాలతో స్థానికులు ఆరోగ్య సమస్య లతో సతమతమవుతున్నారన్నారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సుమోటోగా తీసుకుని తప్పుచేసిన వారిని దండిస్తూ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.