గోరుముద్దలోనూ.. సీఎం జగన్‌ చిత్రం!

ABN , First Publish Date - 2023-08-02T00:29:54+05:30 IST

ఎందెందు వెదికినా.. అన్న చందాన బాలింతలు, అంగన్‌వాడీ పిల్లలకు అందించే బలవర్థకమైన ఆహారాన్నీ ముఖ్యమంత్రి ప్రచారానికి వాడేసుకుంటున్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా రేషన్‌ డిపోలకు పంపిణీ అయిన గోరుముద్ద కిట్లలోని ప్యాకెట్లపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. తొలిసారిగా ప్యాకింగ్‌ రూపంలో రేషన్‌ దుకాణాలకు బలవర్థకమైన నిత్యావసరాలు వచ్చాయి.

గోరుముద్దలోనూ.. సీఎం జగన్‌ చిత్రం!
గోరు ముద్ద పథకం ప్రారంభం కోసం సిద్ధం చేసిన ప్యాకెట్లు

ప్యాకెట్ల రూపంలో నిత్యావసరాలు.. వాటిపైనా వైసీపీ రంగులు

గోరు ముద్ద పేరుతో ముందే రేషన్‌ డిపోలకు చేరిన కిట్లు

ఐసీడీఎస్‌ నేతృత్వంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎందెందు వెదికినా.. అన్న చందాన బాలింతలు, అంగన్‌వాడీ పిల్లలకు అందించే బలవర్థకమైన ఆహారాన్నీ ముఖ్యమంత్రి ప్రచారానికి వాడేసుకుంటున్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా రేషన్‌ డిపోలకు పంపిణీ అయిన గోరుముద్ద కిట్లలోని ప్యాకెట్లపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. తొలిసారిగా ప్యాకింగ్‌ రూపంలో రేషన్‌ దుకాణాలకు బలవర్థకమైన నిత్యావసరాలు వచ్చాయి. గోరు ముద్ద పథకాన్ని బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించనుండటంతో అంగన్వాడీ కేంద్రాలకు బలవర్థకమైన నిత్యావసరాల కిట్లను ముందుగానే పంపిణీ చేశారు. ప్రతీనెలా పీడీఎస్‌ కోటాతో పాటు 20వ తేదీన రేషన్‌ డీలర్లకు ఐసీడీఎస్‌ నేతృత్వంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసరాలు వచ్చేవి. ఈసారి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్యాకెట్లపై జగన్‌ బొమ్మ, వైసీపీ రంగులు ఉండటం గమనార్హం. మూడు కిలోల బియ్యం ప్యాకెట్లతో పాటు పామాయిల్‌, కందిపప్పు వంటి నిత్యావసరాలు అన్నీ కూడా ప్యాకెట్స్‌ రూపంలో వచ్చాయి. ఇంటికే వీటిని ఇచ్చే అవకాశం ఉంది. దీనిని ప్రచారానికి వాడుకోవాలనుకున్న ప్రభుత్వం జగన్‌, పార్టీ గుర్తులను ప్యాకెట్లపై ముద్రించింది.

Updated Date - 2023-08-02T00:29:54+05:30 IST