ధూమపానంతో ఆయుష్షు ఆవిరి

ABN , First Publish Date - 2023-06-01T00:41:38+05:30 IST

పొగాకు, మాదక ద్రవ్యాలు వినియోగంతో కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్‌వో) డాక్టర్‌ జి.గీతాబాయి అన్నారు.

ధూమపానంతో ఆయుష్షు ఆవిరి
మచిలీపట్నంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో గీతాబాయి,

మచిలీపట్నం టౌన్‌, మే 31: పొగాకు, మాదక ద్రవ్యాలు వినియోగంతో కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్‌వో) డాక్టర్‌ జి.గీతాబాయి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం అవగాహనా ర్యాలీని డీఎంహెచ్‌వో ప్రారంభించారు. చిన్న వయసులోనే కొందరు సిగరెట్లు తాగుతున్నారని, దీనివల్ల అనేక అనర్థాలు కలుగుతాయని, తల్లిదండ్రులు వారికి వివరించి చెప్పాల న్నారు. టొబాకో కంట్రోల్‌ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో డీ అడిక్షన్‌ సేవలను అందిస్తున్నామని, ఉచితంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని తెలిపారు. పొగాకు వ్యసనం తీవ్రత మేరకు ప్రభుత్వాస్పత్రిలో ఫార్మకో థెరపీని అందుబాటులోకి తెచ్చా మని ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రత్నగిరి తెలిపారు. పాఠ శాలలకు 100గజాలలోపు పొగాకు ఉత్పత్తులను వాడకూడ దన్నారు. ర్యాలీలో డాక్టర్‌ సాయి, బి.శివసాంబిరెడ్డి, బి.రాజేం ద్రకుమార్‌, బి.సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:41:38+05:30 IST