వైసీపీ పాలనలో కార్మికులకు ఉపాధి కరువు
ABN , First Publish Date - 2023-05-02T01:07:16+05:30 IST
వైసీపీ పాలనలో ఉపాధి దొరక్క అన్ని రంగాల కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్మే గద్దె రామ్మోహన్ అన్నారు.
రాణిగారితోట: వైసీపీ పాలనలో ఉపాధి దొరక్క అన్ని రంగాల కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్మే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో ముఠాకార్మికులు, భవన, ఆటో కార్మికులు ఉపాధి లేకుండా ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే డే సందర్భంగా వారధి ఆటోస్టాంట్ వద్ద టీఎన్టీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. గాజువాకలో టీఎన్టీయూసీ బహిరంగ సభకు విజయవాడ నుంచి వెళ్తున్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి బుద్ధి చెప్పాలన్నారు.