ఉప సర్పంచ్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-06-01T00:22:29+05:30 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాయిదా పడిన ఉప సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఉప సర్పంచ్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

ఎన్నికల సంఘం ఆదేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాయిదా పడిన ఉప సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జూన్‌ 8వ తేదీన ఉప సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని మల్లేశ్వరం, నాగాయలంక మండలంలోని పేపాలెం, పెదపారుపూడి మండలం పరిధిలో మోపర్రు, పమిడిముక్కల మండలంలోని అమీనాపురం, ఉయ్యూరు మండలంలోని ఆకునూరు, పెదఓగిరాల గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో చందర్లపాడు మండలంలోని చందర్లపాడు, వత్సవాయి మండలంలోని తల్లూరు పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నికలకు ఆదేశించింది. జిల్లా పంచాయతీ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది.

Updated Date - 2023-06-01T00:22:29+05:30 IST