ఈదురు గాలులు, భారీవర్షం
ABN , First Publish Date - 2023-03-19T00:25:24+05:30 IST
ఉయ్యూరు పట్టణం, మండల పరిధి గ్రామాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. ఒక్క సారిగా ఆకాశం మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

ఉయ్యూరు, మార్చి 18 : ఉయ్యూరు పట్టణం, మండల పరిధి గ్రామాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. ఒక్క సారిగా ఆకాశం మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగి రోడ్లపై అడ్డంగా పడగా దుర్గాఎస్టేట్ ఇతర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వర్షానికి పట్టణంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాల్లో మినప పంట తడిసి రైతులకు తీవ్రనష్లం వాటిల్లింది. మామిడి, తమలపాకు పం టలకు నష్టం కలిగించింది. రోడ్లపక్కన, భవనాలపై కట్టిన భారీ ఫ్లెక్సీలు గాలికి రోడ్లపై పడ్డాయి. ఆసమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.