వైసీపీ పాలనకు చరమగీతం పాడండి

ABN , First Publish Date - 2023-01-23T00:10:22+05:30 IST

ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష కారణాలు చెబుతూ రైతులను కష్టాలకు గురిచేస్తున్న వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పామ ర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్లకుమార్‌రాజా అన్నారు.

వైసీపీ పాలనకు చరమగీతం పాడండి
మంటాడలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో వర్ల కుమార్‌ రాజా

పమిడిముక్కల, జనవరి 22 : ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష కారణాలు చెబుతూ రైతులను కష్టాలకు గురిచేస్తున్న వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పామ ర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్లకుమార్‌రాజా అన్నారు. మంటాడలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిరసన కార్యక్రమం ఆదివారం జరిగింది. కుమార్‌రాజా మాట్లాడుతూ రైతులు తోలిన ధాన్యం డబ్బులు సకాలంలో ఇవ్వకపోవటంతో అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీ పెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు మీర్జా మాజిద్‌ రజా, జక్కా శ్రీనివాసరావు, కుమ్మరి రామారావు, పండలనేని రమణ, మర్రివాడ సర్పంచి ఒంపుగడవల ప్రాన్సిస్‌, అబ్బాస్‌ అలీ, యార్లగడ్డ రాజేంద్రప్రసాద్‌, గుర్విందపల్లి శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బీసీలకు ఒరిగిందేమీ లేదు : వీరంకి

మచిలీపట్నం టౌన్‌ : నిధులు ఇవ్వకుండా 56 బీసీ కులాల కార్పొరేషన్ల పదవీ కాలం పొడిగించడం వల్ల ఒరిగిందేమీ లేదని టీడీపీ బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు. మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో గురుమూ ర్తి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి సబ్సిడీ రుణాలు ఇవ్వని కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లకు ఏ ముఖం పెట్టుకుని మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో బీసీలకు సబ్‌ ప్లాన్‌ నిధులు తీసుకువచ్చి రూ. 34 వేల కోట్లు ఖర్చు చేశామని, బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఏడున్నర లక్షల మందికి పేదలకు వ్యక్తిగత రుణాలు అందించామన్నారు. ఆదరణ పథకం కింద నాలుగున్నర లక్షల మంది చేతి వృత్తుల వారికి పరికరాలు అందించామన్నారు. విదేశీ విద్య, పెళ్ళి కానుక, ఉన్నత విద్య శిక్షణ; బీసీ స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈనెల 27 నుంచి నారా లోకేష్‌ చేపట్టనున్న పాదయాత్రకు బీసీ లు స్వాగతం పలుకుతారన్నారు. రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి తాడిబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్రరావు, టీడీపీ కృష్ణాజిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-23T00:10:57+05:30 IST