దూసిన కత్తి.. తెగిన కట్టలు

ABN , First Publish Date - 2023-01-15T01:11:19+05:30 IST

యనమలకుదురు, చోడవరం, పోరంకి ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందేలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉద యం నుంచే నిర్వాహకులు పందేలను నిర్వహించడానికి సమాయత్తమవగా పోలీసులు అనుమతి లేదం టూ నిర్వాహకులను, ప్రేక్షకులను చెదరగొట్టారు. దీం తో పందేలు చూడడానికి వచ్చిన ప్రేక్షకులు, నిర్వాహకులు యనమలకుదురు పెదపులిపాక రోడ్డుపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 దూసిన కత్తి.. తెగిన కట్టలు
గండిగుంటలో కోడి పందేలు

ఫ యథేచ్ఛగా కోడి పందేలు, పేకాట

ఫ చోడవరం శిబిరం వద్ద ఘర్షణ

ఫపత్తా లేని పోలీసులు, నిర్వాహకులు

పెనమలూరు, జనవరి 14 : యనమలకుదురు, చోడవరం, పోరంకి ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందేలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉద యం నుంచే నిర్వాహకులు పందేలను నిర్వహించడానికి సమాయత్తమవగా పోలీసులు అనుమతి లేదం టూ నిర్వాహకులను, ప్రేక్షకులను చెదరగొట్టారు. దీం తో పందేలు చూడడానికి వచ్చిన ప్రేక్షకులు, నిర్వాహకులు యనమలకుదురు పెదపులిపాక రోడ్డుపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ పందేల నిర్వహణలో అనిశ్చితి నెలకొంది. పోలీసులపై వైసీపీ నాయకుల ఒత్తిడి ఎక్కువవడంతో, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్వాహకులు పోటీలను ప్రారంభించారు. చోడవరం బరి వద్ద నిర్వాహకుల నిర్లక్ష్యంతో పందేల రాయుళ్ల మధ్య ఘర్షణ జరిగింది. పేకాట శిబిరంలో, పందేలలో తమ కు అన్యాయం జరిగిందంటూ కొంత మంది పందెం రాయుళ్లు అక్కడి నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. దీంతో సర్ది చెప్పాల్సిన నిర్వాహకులు, పోలీసులు దరిదాపుల్లో కూడా లేకుండా పోయారు. యనమలకుదురు, చోడవరం శిబిరాల వద్ద కోడి పందేల కంటే పేకాట శిబిరాలు వందకు పైగా ఏర్పాటు చేశారు. శిబిరానికి ముప్పైవేల చొప్పున వసూలు చేసిన నిర్వాహకులు కేవలం పేకాట శిబిరాల నుంచే పాతిక లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఉయ్యూరు : ఉయ్యూరు మండలంలో కోడి పుంజులు కత్తులు కట్టి పందేనికి సై అన్నాయి. మం డల పరిధి గ్రామల్లో శనివారం కోడి పందేలు, జూదం, చిన్న బజార్‌, పెద్దబజార్‌లు యథేచ్ఛగా జరుగగా లక్షల్లో డబ్బు చేతులు మారాయి. గండిగుంట, పెద ఓ గిరాల, ఆకునూరు, బోళ్లపాడులో సంక్రాంతి సంబ రాల పేరుతో కోడి పందేలు, పేకాట విచ్చలవిడిగా జరి గింది. కోడిపందేలు, పేకాట ఆడితే చర్యలు తీసు కుం టామన్న పోలీసుల హెచ్చరికలు పందేల నిర్వాహ కు లు లెక్క చేయకుండా పబ్లిక్‌గా వేశారు. పందేల బరుల వద్ద మాముళ్లు తీసుకుని తరువాత కను మరుగయ్యా రన్న వార్తలు వినవచ్చాయి. పందేలు చూసేందుకు మహిళలు సైతం బరుల వద్దకు రావడం విశేషం.

గన్నవరం : మండలంలో పలు చోట్ల కోడిపందేలు, పేకాట, ఇతర జూదాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వైసీపీ నాయకులు బరులను సిద్ధం చేశారు. వాటిపై పోలీసు లు కన్నెత్తి కూడా చూడలేదు.

ముస్తాబాద, కొండపావులూరు, గోపవరపుగూడెం, తెంపల్లి, చినఅవుటపల్లి, మర్లపాలెం గ్రామాల్లో పేకాట, కోడిపందేలు, గుండా టలు జోరుగా సాగాయి. ముస్తాబాదలో వరుసగా 5 కోళ్లు కొట్టిన వారికి ద్విచక్ర వాహనాన్ని వైసీపీ నాయకులు మేచినేని బాబు, జడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌ రాణి అందజేశారు. పోలీసులు జూదం శిబిరాల వైపు వెళ్లకపోవటంతో అధి కార పార్టీ నాయకులు బరితెగించి జూదాలను నిర్వ హించారు. పోలీసుల కనుసన్నల్లోనే జూదాలు జరు గుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-01-15T01:11:27+05:30 IST