దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత
ABN , First Publish Date - 2023-07-27T00:57:29+05:30 IST
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులో బుధవారం వేకువజామున కొండచరియలు విరిగి పడ్డాయి.
వన్‌టౌన్, జూలై 26 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులో బుధవారం వేకువజామున కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో అధికారులు ఘాట్‌రోడ్డుపై రాకపో కలను నిలిపివేశారు. మహామండపం లిఫ్టుల ద్వారా దర్శనానికి అనుమతించారు. అనంతరం ఇంజనీ రింగ్ అధికారులు, తమ సిబ్బందితో కొండచరి యలను తొలగింపజే శారు. వేకువజామున ఈ ఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.