Share News

పంటలు ఎండిపోతున్నా కనిపించదా!

ABN , First Publish Date - 2023-11-10T01:44:43+05:30 IST

కరువు మండలాల ప్రకటనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం నందిగామ పరిసర గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో సమగ్ర జల విధానం లేకపోవడం వల్ల నదుల్లో నీరున్నా పంటలు ఎండిపోయే స్థితి నెలకొందన్నారు.

పంటలు ఎండిపోతున్నా కనిపించదా!
ఎండిపోయిన పంటలు పరిశీలిస్తున్న సీపీఐ రామకృష్ణ

నందిగామ, నవంబరు 9 : కరువు మండలాల ప్రకటనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం నందిగామ పరిసర గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో సమగ్ర జల విధానం లేకపోవడం వల్ల నదుల్లో నీరున్నా పంటలు ఎండిపోయే స్థితి నెలకొందన్నారు. వేదాద్రి ఎత్తిపోతల మరమ్మతులకు గురై ఆయకట్టు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం హేయమన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. జిల్లాలో 14 మండలాలో తీవ్ర కరువు ఉన్నా కేంద్రం కేవలం రెండు మండలాలను మాత్రమే గుర్తించిందని, దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించలేని దీన స్థితిలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈనెల 20, 21 తేదీలలో సీపీఐ ఆధ్వర్యంలో కరువు దీక్షలు చేపడుతున్నామని, రైతులు పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒత్తిడి పెంచడం ద్వారా కేంద్రం స్పందించి కరువు మండలాల గుర్తింపులో పారదర్శకత పాటించేలా చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, చుండూరు సుబ్బారావు, పరుచూరి రాజేంద్ర, మన్నెం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T01:44:47+05:30 IST