శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

ABN , First Publish Date - 2023-07-02T01:35:01+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు (శని,ఆది, సోమ) ఉత్సవాలు జరగనున్నాయి. శనివారం అమ్మవారి మూలవిరాట్టు, అర్చా మూర్తి, ఆలయప్రాంగణం, ఉపాలయాలల్లో వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు.

శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

వన్‌ టౌన్‌, జూలై 1 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు (శని,ఆది, సోమ) ఉత్సవాలు జరగనున్నాయి. శనివారం అమ్మవారి మూలవిరాట్టు, అర్చా మూర్తి, ఆలయప్రాంగణం, ఉపాలయాలల్లో వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. ఒకప్పుడు కరువుకాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షితా అవతరించి జీవరాశులన్నింటికి అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు. జీవజలాలన్నింటినీ ఆమె శరీరం నుంచి విడుదల చే సి కాపాడింది. ప్రజలకు కావాల్సిన శాకాలను సృష్టించినందుకు ఆమెను శాకంబరిగా కొలుస్తారు. ఈక్రమంలో శాకంబరీ ఉత్సవాలను అమ్మవారి ఆలయాలలో నిర్వహించడం ఆనవాయితీ. దుర్గగుడిలో తొలిరోజు శనివారం సంకల్ప పూజలో ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యుడు శివప్రసాదశర్మ, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

దుర్గమ్మకు సారె సమర్పణ

కనకదుర్గమ్మకు ఆషాఢమాస సారె సమర్పణలు కొనసాగాయి. శనివారం హిందూ ధర్మ ప్రచారపరిషత్‌, పలువురు భక్త బృందాలు అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించారు. పూజలు చేసి మొక్కులు సమర్పించారు.

తిరుపతమ్మ ఆలయంలో ..

పెనుగంచిప్రోలు : తిరుపతమ్మ దేవస్థానంలో ఆషాఢ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. అధికారులు, పాలక వర్గం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల భక్తులు విరాళంగా ఇచ్చిన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో తిరపతమ్మ - గోపయ్య స్వామిల విగ్రహాలు, సహ దేవతలను విశేషంగా అలంకరిస్తున్నారు.

Updated Date - 2023-07-02T01:35:01+05:30 IST