దళిత ద్రోహి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-05-26T01:01:35+05:30 IST

దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి వింజమూరి సతీష్‌ విమర్శించారు.

దళిత ద్రోహి సీఎం జగన్‌

దళిత ద్రోహి సీఎం జగన్‌

టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి వింజమూరి సతీష్‌

పాయకాపురం, మే 25 : దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి వింజమూరి సతీష్‌ విమర్శించారు. 64వ డివిజన్‌లోని కండ్రికలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలపై జరుగుతున్న దాడులు, సబ్‌ ప్లాన్‌ నిధులు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఉన్న 27 రకాల సబ్సిడీ లోన్లు ఎగవేతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన దళితులకు ఆయన ఇచ్చిన బహుమతి దాడులన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వైసీపీ పాలనలో రద్దు చేసిన పథకాలను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నేతలు పరుచూరి ప్రసాద్‌, తేళ్ల భవాని, దిలీప్‌, అశోక్‌, నవనీతం సాంబశివరావు, కంకణాల బాబు, జైపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:01:35+05:30 IST