వైసీపీ పాలనలో పెరుగుతున్న దళితుల హత్యలు

ABN , First Publish Date - 2023-06-03T01:21:09+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితుల హత్యలు పెరిగిపోతున్నాయని, హత్య లను పోలీసు అధికారులు ఆత్మహ త్యలుగా చిత్రీక రిస్తున్నారని ఎమ్మా ర్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో పెరుగుతున్న దళితుల హత్యలు
ఏఎస్పీ శ్రీహరిబాబుకు వినతిపత్రం ఇస్తున్న మందకృష్ణ మాదిగ

పైగా వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు

పెదపులిపాకలో మృతి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి జీవన్‌ది హత్యే, ఆత్మహత్య కాదు..మృతిపై వాస్తవాలు వెల్లడించాలి

కృష్ణా జిల్లా ఏఎస్పీ శ్రీహరిబాబును కోరిన ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 2: వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితుల హత్యలు పెరిగిపోతున్నాయని, హత్య లను పోలీసు అధికారులు ఆత్మహ త్యలుగా చిత్రీక రిస్తున్నారని ఎమ్మా ర్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా ఏఎస్పీ ఆర్‌.శ్రీహరిబాబును మందకృష్ణ శుక్రవారం కలిశారు. పెనమలూరు మండలం పెదపులిపాకలో ఇంజనీరింగ్‌ విద్యార్థి జీవన్‌ మృతి ఘటనపై వాస్తవాలు వెల్లడించాలని ఆయన కోరారు. మే 9న అర్ధరాత్రి జీవన్‌ను దారుణంగా కొట్టి పెట్రోలు పోసి కాల్చి చంపారని ఆయన ఆరోపిం చారు. జీవన్‌ది మొదట హత్యగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా చెప్పారన్నారు. ఇన్‌స్టాగ్రాంలో పోస్టింగ్‌ చూసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వాస్తవానికి అది హత్యేనన్నారు. పోస్టుమార్టంపైనా అనుమానాలు ఉన్నాయని, వాటిపై ఎస్పీతో మాట్లాడేందుకు వచ్చానని, ఆయన లేక పోవడంతో ఏఎస్పీతో మాట్లాడానన్నారు. అనంతపురం, కడపలోనూ ఇలాగే దళితు లను హత్య చేశారని, బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోవలేదన్నారు. పోలీసు యంత్రాంగం రాష్ట్రంలో దళిత బాధిత కుటుంబాల పక్షాన నిలవకుండా నిందితులకు వత్తాసు పలుకుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయం చేయాలని డీజీపీకి, హోం మినిస్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొల్లూరి బసవ, పేకేటి ప్రభాకరరావు, కొక్కిలిగడ్డ నవీన్‌, జోనపూడి పృఽథ్వి, కె.చిట్టిబాబు, కె.డాని యేల్‌, మరియకుమార్‌, రాజు, మంద వెంకటేశ్వరరావు, దినేష్‌, న్యాయవాది విజయ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:21:09+05:30 IST