వాంబేకాలనీ రైల్వేట్రాక్‌ వద్ద సీపీఎం నిరసన

ABN , First Publish Date - 2023-09-23T00:28:35+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి చూపించకపోగా ఉన్న ఉపాధిని కోల్పోయే చర్యలు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు.

వాంబేకాలనీ రైల్వేట్రాక్‌ వద్ద సీపీఎం నిరసన
నిరసనలో పాల్గొన్న బాబూరావు

రోడ్డు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ

వాంబేకాలనీ రైల్వేట్రాక్‌ వద్ద సీపీఎం నిరసన

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 22 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి చూపించకపోగా ఉన్న ఉపాధిని కోల్పోయే చర్యలు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. శివారు ప్రాంత ప్రజలు చాలా మంది ఉపాధి కోసం నగరంలోకి వెళ్లే మార్గమైన వాంబేకాలనీ రైల్వేట్రాక్‌ వద్ద రోడ్డును తొలగించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు శుక్రవారం వాంబేకాలనీ ట్రాక్‌ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉపాధి చూపించకపోగా ఉపాధిని కోల్పోయే చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంతం నుంచి నడకదారిని వెళ్లే కూలీలు వాంబేకాలనీ రైల్వే ట్రాక్‌ మార్గం గుండా వెళ్తున్నారని, ఇప్పుడు రహదారిని తొలగించడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాలు తక్షణమే వాంబేకాలనీ నుంచి నగరంలోకి తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేసి అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే వాంబేకాలనీ నుంచి దేవినగర్‌ వైపు ఆర్‌యూబీ నిర్మించాలని అప్పటి వరకు తాత్కాలికంగా నడకదారిని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నేతలు కె. దుర్గారావు, రమణారావు, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:28:35+05:30 IST