ముగిసిన సీపీఐ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2023-07-11T00:52:05+05:30 IST

బూర్జూవా పార్టీలకు అధికారమే తప్ప ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. గన్నవరం రాయనగర్‌ కల్యాణ మండపంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, శాఖ కార్యదర్శులకు రాజకీయ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి.

ముగిసిన సీపీఐ శిక్షణ తరగతులు
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి

గన్నవరం, జూలై 10 : బూర్జూవా పార్టీలకు అధికారమే తప్ప ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. గన్నవరం రాయనగర్‌ కల్యాణ మండపంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, శాఖ కార్యదర్శులకు రాజకీయ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ దోపిడీకి గురైన వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు రద్దు చేశారని మండిపడ్డారు. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా కలిసివచ్చే ప్రజాస్వామ్యవాదులతో కలసి కమ్యూనిస్టు పార్టీ వెళుతుందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు శ్యాంసుందరం మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని వారు స్వాతంత్య్రం సాధించామని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమన్నారు. కర్ణాటకలో ఓటమి తరువాత బీజేపీకి భయం పట్టుకుందన్నారు.

Updated Date - 2023-07-11T00:52:05+05:30 IST