Share News

అధికార మదంతో చెలరేగిపోతున్న కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2023-11-06T01:04:10+05:30 IST

అధికార మదంతో చెలరేగిపోయే కార్పొరేటర్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎంఎస్‌ బేగ్‌ హెచ్చరించారు.

అధికార మదంతో చెలరేగిపోతున్న కార్పొరేటర్లు

వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే: ఎంఎస్‌ బేగ్‌

వన్‌టౌన్‌, నవంబరు 5: అధికార మదంతో చెలరేగిపోయే కార్పొరేటర్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎంఎస్‌ బేగ్‌ హెచ్చరించారు. ఆదివారం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వమొచ్చాక పశ్చిమ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అండదండలతో కార్పొరేటర్లు చెలరేగిపోతున్నారని, భవానీపురంలో అవినీతికి, భూకబ్జాలకు కేరాఫ్‌గా వైసీపీ మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యరెడ్డి, ఆంజనేయరెడ్డిల అవినీతి వ్యవహారాన్ని ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. కార్పొరేటర్ల వసూళ్ల వ్యవహారం మీడియాలో వైరల్‌ అయిందన్నారు. వన్‌టౌన్‌లో కొణిజేటి రోశయ్య, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పా టుకు వ్యాపారుల నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేశారని, భవానీ పురంలో వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటుకు అన్ని నియోజకవర్గాల్లోని వ్యాపారులను భయపెట్టి రూ.30 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దసరా ఉత్సవాల్లో తన బినామీలకు కాంట్రాక్టులు ఇవ్వలేదని దుర్గగుడి ఈవోను వెలంపల్లి శ్రీనివాసరావు బదిలీ చేయించారన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. 144వ సెక్షన్‌ అమలులో ఉండగా వైసీపీ నాయకులు ర్యాలీలు, సభలు ఎలా పెడతారని ప్రశ్నించారు. వాళ్లకు ఈ సెక్షన్‌ వర్తించదా అని ప్రశ్నించారు. సారెపల్లి రాఽధాకృష్ణ, బూర కనకారావు, బెవర సాయి సుధాకర్‌, సయ్యద్‌ కరీముల్లా, సురభి బాలు, రావూరి సత్యనారాయణ, ఆళ్ళ మోహనరావు, షేక్‌ సుభాని, అజీజ్‌, ఇమ్రాన్‌, దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T01:04:11+05:30 IST