Share News

మూడు నెలల్లో పట్టాభి స్మారక నిర్మాణం

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:07 AM

టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు దివంగత భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. ఆదివారం పట్టాభి సీతారామయ్య వర్థంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మూడు నెలల్లో పట్టాభి స్మారక నిర్మాణం
భోగరాజు పట్టాభి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలో కొనకళ్ల నారాయణ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ తదితరులు

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 17 : టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు దివంగత భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. ఆదివారం పట్టాభి సీతారామయ్య వర్థంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ, పట్టాభి స్మారక భవన నిర్మానానికి అనుమతులు ఇచ్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని అడ్డుపడుతూ.. మరోవైపు వైసీపీ కార్యాలయాన్ని అఘమేఘాల మీద నిర్మిస్తున్నారన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, నగర ప్రజలకు ఉపయోగపడే స్మారక భవనాన్ని నిర్మించేందుకు వెనుకాడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్‌, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సభకు తరలిరండి

మచిలీపట్నం టౌన్‌ : యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఈనెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో జరిగే సభా కార్యక్రమాలకు టీడీపీ శ్రేణులు తరలిరావాలని మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రకు వచ్చిన ప్రభంజనం చూసి సీఎం జగన్‌రెడ్డికి భయం పుట్టుకు వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. 20న జరిగే పాదయాత్రలో పార్టీపరంగా నూతన అంశాలను ఆవిష్కరిస్తారన్నారు.

యువగళం సభను విజయవంతం చేయాలి

- పార్టీ శ్రేణులకు వర్ల రామయ్య పిలుపు

విద్యాధరపురం, డిసెంబరు 17 : భోగాపురంలో ఈనెల 20న జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొగల్రాజపురంలోని కేశినేని శివనాథ్‌ (చిన్ని) కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లోకేశ్‌ మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారన్నారు. వైసీపీ నాయకుల జాతకాలు, అవినీతి అధికారుల బాగోతాలు అన్నీ లోకేశ్‌ తన రెడ్‌బుక్‌లో రాశారన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా నాయకులకు దిశా నిరే ్ధశం చేశారు. అనంతరం రామయ్యను దుశ్శాలువతో శివనాథ్‌ (చిన్ని) సత్కరించారు.

Updated Date - Dec 18 , 2023 | 01:07 AM