ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి
ABN , First Publish Date - 2023-03-05T00:22:53+05:30 IST
పట్టణం శివారు పీటీకొత్తూరులో ఇంటి నిర్మాణాలు త్వరిత గతిన పూర్తిచేసి ఉగాదికి లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అన్నారు.
తిరువూరు, మార్చి 4: పట్టణం శివారు పీటీకొత్తూరులో ఇంటి నిర్మాణాలు త్వరిత గతిన పూర్తిచేసి ఉగాదికి లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అన్నారు. శనివారం జగనన్న కాలనీని పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి శ్లాబుస్థాయి ఇళ్లకు బిల్లులు త్వరితగతిన అందేలా హౌసింగ్ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు నేరుగా నిర్మించుకుంటున్న గృహాలు నాణ్యతాప్రమాణాలు పాటించేలా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కాలనీలో వీధిలైట్లు, తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రెయిన్ తదితర మౌలికవసతులకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. హౌసింగ్ డీఈ రహీముద్దీన్, ఏఈలు పాల్గొన్నారు.