వీరంకి కుటుంబ సభ్యులకు గద్దె అనురాధ పరామర్శ
ABN , First Publish Date - 2023-03-02T00:46:43+05:30 IST
గన్నవరం ఘటనలో పోలీసుల తప్పుడు కేసులతో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్ర బీసీ సెల్ నాయకులు వీరంకి గురుమూర్తి భార్య విజయకుమారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ బుధవారం ఉదయం తోట్లవల్లూరు గ్రామంలోని వీరంకి గురుమూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
వీరంకి కుటుంబ సభ్యులకు గద్దె అనురాధ పరామర్శ
పటమట, మార్చి 1 : గన్నవరం ఘటనలో పోలీసుల తప్పుడు కేసులతో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్ర బీసీ సెల్ నాయకులు వీరంకి గురుమూర్తి భార్య విజయకుమారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ బుధవారం ఉదయం తోట్లవల్లూరు గ్రామంలోని వీరంకి గురుమూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బొడ్డు సుగుణాకరరావు, కొనగాల రాజ్యలక్ష్మి, ఆచంట కోటేశ్వరరావు, వీరంకి నారాయణ, సీహెచ్. పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సైకిల్ పంపిణీ: తూర్పు పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌కు చెందిన నిరుపేద మహిళ నగిడి గీతావాణికి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ బుధవారం సైకిల్ అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిల్‌ను గద్దె అనురాధ అశోక్‌నగర్‌లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో అందజేశారు.