Share News

చెవిలో పూలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:45 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల మంది సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

 చెవిలో పూలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
విజయవాడ ధర్నాచౌక్‌లో చెవిలో పూలతో నిరసన తెలుపుతున్న సమగ్రశిక్ష ఉద్యోగులు,

ధర్నాచౌక్‌, డిసెంబరు 30: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల మంది సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ధర్నాచౌక్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా 10వ రోజు శని వారమూ కొనసాగింది. దీక్షా శిబిరాన్ని సందర్శించి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు టి.విజయసుగుణకుమారి పాల్గొన్నారు.

బందరులో పొర్లు దండాలు పెడుతూ..

మచిలీపట్నం టౌన్‌: ధర్నాచౌక్‌ వద్ద జీతాలు పెంచాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. రూ.26 వేల జీతం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సంఘ నాయకుడు పోతురాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:47 AM