భూ సేకరణలో రైతులు నష్టపోకుండా పరిహారం
ABN , First Publish Date - 2023-03-02T00:37:25+05:30 IST
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు.
జి.కొండూరు, మార్చి 1: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. విజయవాడ- ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బుధవారం జేసీ రెవెన్యూ అధికారులతో కలసి దుగ్గిరాలపాడు, పెంట్రంపాడు, గంగినేని పాలెం, తెల్లదేవరపాడు, సున్నంపాడుల్లో భూముల ధరపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ ఆర్.వి.వి.రోహిణీదేవి, సర్వేయర్ భాను మంగేష్కర్, రైతులు పాల్గొన్నారు.