ఉప్పాల రాంప్రసాద్‌కు సీఎం నివాళి
ABN , First Publish Date - 2023-06-19T00:22:09+05:30 IST
డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు ఉప్పాల రాం ప్రసాద్ (60) భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతూ ఉప్పాల రాంప్రసాద్ ఆదివారం రాత్రి మరణించారు.
కుటుంబీకులను ఓదార్చిన జగన్
మచిలీపట్నం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు ఉప్పాల రాం ప్రసాద్ (60) భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతూ ఉప్పాల రాంప్రసాద్ ఆదివారం రాత్రి మరణించారు. భౌతికకాయాన్ని ఉప్పాల స్వగ్రామ మైన పెడన మండలం కూడూరు పంచాయతీలోని కృ ష్ణాపురానికి తీసుకువచ్చారు. మరణవార్తను తెలుసు కున్న సీఎం జగన్ ఉప్పాల గృహానికి సోమవారం వచ్చా రు. భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. రాంప్రసాద్ భార్య నాగమణి, కుమారుడు రాము, ఆయన భార్య, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, కుమా ర్తెలు అనూరాధ, అనితను సీఎం పరామర్శించి ఓదా ర్చారు. మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, వ్యవసాయ మిషన్ రాష్ట్ర వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, ఎమ్మెల్యేలు పేర్నినాని, కొడాలి నాని, దూలం నాగే శ్వరరావు, వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్‌బాబు, కొక్కి లిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ పి.జాషువా, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, మచిలీపట్నం మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీ పీలు రాంప్రసాద్‌కు నివాళులర్పించారు.