Share News

అంగన్వాడీలను మోసం చేసిన సీఎం జగన్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:21 AM

అంగన్వాడీలను సీఎం జగన్మోహన్‌రెడ్డి మోసం చేశారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి రవి అన్నారు. ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వా డీలు ధర్నా కొనసాగించగా గురువారం సూరంపల్లిలో అంగ న్వాడీ సెంటర్‌ వద్ద చిన్నారుల తల్లులు నిరసన వ్యక్తం చేశారు.

అంగన్వాడీలను మోసం చేసిన సీఎం జగన్‌
గన్నవరం ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి రవి విమర్శ

గన్నవరం, డిసెంబరు 21: అంగన్వాడీలను సీఎం జగన్మోహన్‌రెడ్డి మోసం చేశారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి రవి అన్నారు. ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వా డీలు ధర్నా కొనసాగించగా గురువారం సూరంపల్లిలో అంగ న్వాడీ సెంటర్‌ వద్ద చిన్నారుల తల్లులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్‌రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ లను విస్మరించారని చౌటపల్లి రవి మండిపడ్డారు. నాలుగున్న రేళ్లు గడచినా కనీస వేతనం ఇవ్వటం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు ఇచ్చి వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. వర్కర్‌లకు సమానంగా వేతనాలు ఇవ్వాలని మినీ వర్కర్‌లకు ప్రమోషన్‌లు కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం, బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి బెజవాడ తాతబ్బాయి, తిరుపతయ్య, కోటేశ్వరమ్మ, విజయకుమారి, ఇందిర, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 01:21 AM