మిర్చి పంటకు తెగుళ్ల బెడద

ABN , First Publish Date - 2023-09-22T00:41:17+05:30 IST

తెగుళ్ల బారిపడిన మిర్చి పంటను ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు.

మిర్చి పంటకు తెగుళ్ల బెడద
అనుముల్లంకలో మిర్చి పంటను పరిశీలిస్తున్న రైతు సంఘ నాయకులు

గంపలగూడెం, సెప్టెంబరు 21: తెగుళ్ల బారిపడిన మిర్చి పంటను ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలో ఈఏడాది 10 వేల ఎకరాల్లో మర్చిని సాగు చేశారు. 50 రోజుల క్రితం సాగు చేసిన మిర్చికి అంతుచిక్కని వైరస్‌ వ్యాప్తి చెందిందన్నారు. కనుమూరు, అనుముల్లంకల్లో 45 ఎకరాల వరకు పంటను తీసేసి ప్రత్యామ్నాయ పంట కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ ఏడాది కూడా మిర్చికి వైరస్‌ సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు తక్షణం స్పందించి పంటను పరిశీలిం చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గువ్వల సీతారామిరెడ్డి, జె.వెంకటే శ్వరరావు, జి.వీరభద్రరావు, ఇ.నాగేశ్వరరావు, ఎన్‌.చిన్నసత్యంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:41:17+05:30 IST