చంద్రబాబు రాజకీయ చతురత.. అనూరాధ విజయం

ABN , First Publish Date - 2023-03-26T00:54:24+05:30 IST

చంద్రబాబు రాజకీయ చతురతతోనే బీసీ మహిళ పంచుమర్తి అనూరాధ విజయం సాధించిందని టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌, చంద్రబాబు చిత్రపటాలకు నేతలు క్షీరాభిషేకం చేశారు.

చంద్రబాబు రాజకీయ చతురత..  అనూరాధ విజయం
ఎన్టీఆర్‌, చంద్రబాబు పటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, మార్చి 25 : చంద్రబాబు రాజకీయ చతురతతోనే బీసీ మహిళ పంచుమర్తి అనూరాధ విజయం సాధించిందని టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌, చంద్రబాబు చిత్రపటాలకు నేతలు క్షీరాభిషేకం చేశారు. సైకో ముఖ్యమంత్రి ఎన్ని అడ్డదారులు తొక్కినా తెలుగుదేశం అభ్యర్ధికి 23 ఓట్లు పడటం శుభపరిణామమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో జగన్‌పై వారికి విశ్వాసం లేదని తేటతెల్లమయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని గొప్పలు చెప్పడం వింతగా ఉందన్నారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఉనికి కోల్పోయేలా చేయడం దురదృష్టకరమన్నారు. వైసీపీ పతనానికి పట్టభద్రుల ఎన్నికలతో పాటు పంచుమర్తి అనూరాధ విజయం నిదర్శనమన్నారు. ప్రజలు టీడీపీవైపే మొగ్గు చూపుతున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. కృష్ణాజిల్లాలో ఏడు అసెంబ్లీ, లోక్‌ సభస్థానాల్లో టీడీపీ గెలిచి తీరుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్‌, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, దింటకుర్తి సుధాకర్‌, అక్కుమహంతి రాజా, నగర పార్టీ అధ్యక్షుడు ఎండి ఇలియాస్‌ పాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, రామధాని వేణు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్‌, గోకుల శివ, పాలపర్తి పద్మ, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:54:24+05:30 IST